Kolkata: హౌరా బ్రిడ్జి వ‌ద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజ‌మౌళి సంద‌డి.. ఫొటోలు, వీడియో ఇవిగో

RRR speaks with the Kolkata press at the Howrah Bridge
  • మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌
  • ప‌లు రాష్ట్రాల్లో చిత్ర బృందం ప‌ర్య‌ట‌న‌
  • ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లో టీమ్
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ ఎన‌ర్జిటిక్‌ హీరోలు న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా మ‌రో మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో రాజ‌మౌళి, తార‌క్, చెర్రీ బిజీగా ఉంటున్నారు. 
                    
నిన్న పంజాబ్‌లో ప‌ర్య‌టించిన ఎన్టీఆర్, చెర్రీ, రాజ‌మౌళి నేడు ప‌శ్చిమ బెంగాల్‌లో సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వారు ముగ్గురూ హౌరా బ్రిడ్జి వ‌ద్ద దిగిన ఫొటోల‌ను ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ప్రాంతంలో వారు ముగ్గురూ స్థానిక మీడియాతోనూ మాట్లాడారు.  
                
Kolkata
West Bengal
RRR
Rajamouli

More Telugu News