Prashant: రెండో పెళ్లి చేసుకోబోతున్న హీరో ప్రశాంత్

Actor Prashant to get second marriage
  • 2005లో గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్న ప్రశాంత్ 
  • మూడేళ్లకే విడాకులు తీసుకున్న వైనం
  • ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అమ్మాయితో రెండో పెళ్లి 
తమిళ హీరో ప్రశాంత్ కు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నిర్మాత త్యాగరాజన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రశాంత్... అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపుపొందాడు. ఇటీవలి కాలంలో తెలుగులో రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. 

మరోవైపు ప్రశాంత్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ప్రశాంత్ 2005లో ఓ వ్యాపారవేత్త కుమార్తె అయిన గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లైన మూడేళ్లకే వీరిద్దరికీ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో 2008లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. 

ఇప్పుడు ప్రశాంత్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడట. తన కుటుంబానికి పరిచయం ఉన్న ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.
Prashant
Tollywood
Kollywood
Second Marriage

More Telugu News