Ajith: జీ5 ఓటీటీలో అజిత్ 'వలీమై'... చెన్నైలో 10 వేల చదరపు అడుగుల పోస్టర్

Ajith starred Valimai digital premiere in Zee OTT
  • అజిత్ హీరోగా వచ్చిన వలీమై
  • సూపర్ హిట్ టాక్ పొందిన చిత్రం
  • ఈ నెల 25 నుంచి జీ5 యాప్ లో స్ట్రీమింగ్
  • ఓ ప్రకటనలో వెల్లడించిన జీ5
తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ నటించిన ‘వలీమై’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈనెల 25 నుంచి ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలో జీ5 సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 చదరపు అడుగుల అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలో ఏ ఓటీటీ సంస్థ ఇంత పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ టాక్‌ ద ఆఫ్‌ టౌన్‌ అయ్యింది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతోంది. 

'వలీమై' చిత్రంలో అజిత్ ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురేషీ ముఖ్య పాత్రలో నటించారు. ఇందులో తెలుగు యువనటుడు కార్తికేయు విలన్ గా నటించడం విశేషం. హెచ్.వినోద్ రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.
Ajith
Valimai
ZEE5
Streaming
Digital Premiere

More Telugu News