A B Venkateswararao: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీపై అంబ‌టి తీవ్ర వ్యాఖ్య‌లు

ambati rambabu harsh comments on ab venkateswararao
  • పెగాసస్‌పై ఏపీలో రాజ‌కీయ దుమారం
  • వైసీపీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఏబీ కౌంట‌ర్‌
  • ఏబీని ప‌చ్చ చొక్కా వేసుకున్న టీడీపీ నేత అన్న అంబ‌టి
టీడీపీ హ‌యాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప‌నిచేసిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై వైసీపీ కీల‌క నేత‌, గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పెగాస‌స్ సాఫ్ట్‌వేర్ వినియోగంపై ఏపీలో రాజ‌కీయ దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు సోమ‌వారం ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌రుక్ష‌ణ‌మే అంబ‌టి రాంబాబు కౌంట‌ర్ ఇచ్చేశారు. ఈ క్ర‌మంలో చంద్రబాబు హయాంలోని ఓ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పోలీసు అధికారిలా పని చేయలేదని ఆరోపించారు. అంత‌టితో ఆగ‌ని రాంబాబు.. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఐపీఎస్ అధికారిగా కాకుండా పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ నేతలా వ్యవహరించారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.
A B Venkateswararao
Ambati Rambabu
YSRCP
Pegasus

More Telugu News