Mukesh Ambani: 15 నెల‌ల వ‌య‌సుకే బ‌డిబాట ప‌ట్టిన ముఖేశ్ అంబానీ మ‌న‌వ‌డు

mukesh ambani grand son joins in scholl at the age of 15 months
  • మ‌ల‌బార్ హిల్ లోని స‌న్‌ఫ్ల‌వ‌ర్ స్కూల్లో పృథ్వీ జాయిన్‌
  • అత‌డి త‌ల్లిదండ్రులు చ‌దివింది అదే స్కూల్లోనేన‌ట‌
  • వైద్యుడితో పాటు గార్డులు కూడా పృథ్వీ వెంట స్కూలుకు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీ 15 నెల‌ల వ‌య‌సుకే బ‌డి బాట ప‌ట్టేశాడ‌ట‌. ఇటీవ‌లే త‌న తొలి జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకున్న పృథ్వీ.. తన తల్లి శ్లోకా మెహతాతో కలిసి మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్‌లో చేరిపోయాడు‌. పృథ్వీని అత‌డి తల్లిదండ్రులు శ్లోకా మెహతా, ఆకాశ్‌ అంబానీలు స్వ‌యంగా స్కూలుకు తీసుకుని వెళ్లారట‌. ఆకాశ్, శ్లోకాలు కూడా గ‌తంలో ఈ స్కూల్‌లోనే చ‌దువుకున్నారు‌. తాము చ‌దివిన స్కూల్‌లోనే త‌మ కుమారుడిని వారు చేర్పించారు.

ఇదిలా ఉంటే.. దేశంలోనే అత్యంత ధ‌న‌వంతులైన కుటుంబానికి చెందిన పృథ్వీ సాధారణ జీవితాన్ని గడపాలని ముఖేశ్ కుటుంబం కోరుకుంద‌ట‌. పృథ్వీ అంబానీ భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశార‌ట‌. పృథ్వీ వెంట నిత్యం ఓ డాక్టర్ ఉండనున్నారు. ఇక సెక్యూరిటీ కోసం సాధార‌ణ దుస్తుల్లోనే ఉండే గార్డులు ఆ ప‌రిస‌రాల‌పై గ‌ట్టి నిఘానే ఉంచ‌నున్నార‌ట‌. 2019లో వివాహం చేసుకున్న శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీలకు డిసెంబర్ 10, 2020న పృథ్వీ జన్మించిన విష‌యం తెలిసిందే.
Mukesh Ambani
Prithvi Akash Ambani
Reliance Industries

More Telugu News