గోవా సీఎంగా ప్ర‌మోద్ సావంత్‌.. ప్ర‌క‌టించిన బీజేపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా సీఎంగా ప్ర‌మోద్ సావంత్‌.. ప్ర‌క‌టించిన బీజేపీ

pamod sawant elected as goa cm
  • గోవాకు రెండోసారి సీఎంగా ప్ర‌మోద్‌
  • గోవా బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎంపిక‌
  • గెలిచిన నాలుగు రాష్ట్రాల్లో పాత‌కాపుల‌కే బాధ్య‌త‌లు
గోవా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మోద్ సావంత్‌ను కొన‌సాగించేందుకే బీజేపీ నిర్ణ‌యించింది. ఈ మేరకు కాసేప‌టి క్రితం సావంత్‌ను గోవా బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎంపిక చేసిన‌ట్లు ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా గోవా సీఎంగా వ‌రుస‌గా రెండోసారి ప్ర‌మోద్ సావంత్ త్వ‌ర‌లో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

ఇటీవ‌ల ముగిసిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజ‌యం సాధించిన నాలుగు రాష్ట్రాల సీఎం అభ్య‌ర్థుల‌ను ఆ పార్టీ ప్ర‌క‌టించిన‌ట్టయింది. నాలుగు రాష్ట్రాల్లో కూడా అంత‌కుముందు సీఎంలుగా వ్య‌వహ‌రించిన నేత‌ల‌కే మ‌ళ్లీ ఆ ప‌ద‌వుల‌ను అప్ప‌గించింది. ఇప్ప‌టికే యూపీ సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ ను ప్ర‌క‌టించిన బీజేపీ.. తాజాగా మ‌ణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్‌, ఉత్త‌రాఖండ్ సీఎంగా పుష్క‌ర్ సింగ్ ధామి, గోవా సీఎంగా ప్ర‌మోద్ సావంత్‌ల‌ను ఆయా రాష్ట్రాల‌కు సీఎంలుగా ప్ర‌క‌టించింది.
Goa
Pramod Sawant
BJP

More Telugu News