china jeeyar: త్రిదండి చిన జీయర్ స్వామిని అరెస్టు చేయాల్సిందేనంటూ ఆయ‌న‌ దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం

adivasis fire on china jeeyar
  • అమ్మవార్ల‌పై ఆయ‌న‌ అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని ఆగ్ర‌హం
  • కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ నుంచి ర్యాలీ
  • కేయూ జంక్షన్ వరకు చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మతో కొన‌సాగింపు
సమ్మక్క-సారక్క అమ్మ‌వార్ల‌పై శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి చేసిన అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆ వ్యాఖ్య‌ల‌పై చిన జీయ‌ర్ స్వామి వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికీ ఈ వివాదం ఆగ‌డం లేదు. అమ్మవార్ల‌పై ఆయ‌న‌ అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని, క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. 

చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయాలని ఆదివాసీ సంఘాలు ఆందోళన కొన‌సాగిస్తున్నాయి. ఈ రోజు వ‌రంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ నుంచి కేయూ జంక్షన్ వరకు వారు చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. కేయూ సెంటర్ చేరుకున్న అనంత‌రం చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
china jeeyar
kakatiya university
Warangal Rural District

More Telugu News