Jeff Bezos: 281 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చేసిన జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ

  • బాయ్స్ అండ్ గాళ్స్ క్లబ్ యూఎస్‌లోనే అతిపెద్ద సేవా సంస్థగా గుర్తింపు
  • 160 సంవత్సరాల క్లబ్ చరిత్రలో ఓ వ్యక్తి అందించిన అతిపెద్ద విరాళం ఇదే
  • నమ్మశక్యం కాకుండా ఉందన్న క్లబ్ అధ్యక్షుడు
Bezos ex wife MacKenzie donates 281 mn dollars to Boys and Girls Clubs of America

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ తనలోని దాతృత్వ గుణాన్ని మరోమారు బయటపెట్టారు. ‘బాయ్స్ అండ్ గాళ్స్ క్లబ్ ఆఫ్ అమెరికా’కు ఏకంగా 281 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. 160 సంవత్సరాల ఈ క్లబ్ చరిత్రలో ఓ వ్యక్తి అందించిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు జిమ్ క్లార్క్ మాట్లాడుతూ.. ఇలాంటి బహుమతులు చాలా అరుదని అన్నారు. నమశక్యం కాకుండా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. 2019లో జెఫ్ బెజోస్‌తో మెకంజీ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల నికర విలువ రూ. 54.4 బిలియన్ డాలర్లు.

బాయ్స్ అండ్ గాళ్స్ క్లబ్ విషయానికి వస్తే.. అమెరికాలోనే ఇది అతిపెద్ద సేవా సంస్థగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా 4,700 ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. ప్రతి ఏడాది 4 మిలియన్ల మందికిపైగా జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పిల్లలు సరదాగా గడుపుతూ వారు తమ సామర్థ్యాలను చేరుకోగలిగే సాధికార వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఈ క్లబ్ సాయపడుతోంది. వారికి నైపుణ్య శిక్ష అందిస్తోంది. ‘స్టెమ్’ లెర్నింగ్, క్రీడలు, వినోదం, కళలతోపాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో విశేష కృషి చేస్తోంది.

More Telugu News