తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్‌న్యూస్.. పావుగంట ఆలస్యమైనా ప్రాక్టికల్స్‌కు ఓకే
- ఈ నెల 23 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు
- ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను రిలీవ్ చేయాలని ఆదేశం
- లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరిక
ఈ పరీక్షలకు విద్యార్థులు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఆదేశించారు. అలాగే, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటలలోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపాలన్నారు. ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లు నేటి నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.