రేపటి నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు
- 27 వరకు కొనసాగనున్న సభ్యత్వ నమోదు
- 5 లక్షల క్రియాశీల సభ్యత్వమే లక్ష్యం
- పార్టీ శ్రేణులకు నాడెండ్ల సూచన
ఆదివారంతో ప్రారంభం కానున్న క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగించనున్నట్టుగా నాదెండ్ల వెల్లడించారు. కొత్తగా సభ్యత్వ నమోదుతో పాటు పాత సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని పార్టీ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వారం పాటు సాగనున్న క్రియాశీల సభ్యత్వ నమోదును 5 లక్షల మార్కును దాటేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.