Harish Rao: క‌ళ్ల ముందు నీళ్లు కనిపించ‌ట్లేదా?... విప‌క్షాలపై హ‌రీశ్ రావు ధ్వజం

harish rao fires on opposition parties
  • మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి గండి చెరువుకు గోదావ‌రి జ‌లాలు
  • విడుద‌ల చేసిన మంత్రి హ‌రీశ్ రావు
  • తెలంగాణ వ‌చ్చాకే పొలాల‌కు నీళ్లొచ్చాయ‌ని వ్యాఖ్య‌
తెలంగాణ‌కు జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అంత‌ర్భాగం అయిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువుకు గోదావరి జలాలను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ‌రీశ్ రావు విడుద‌ల చేశారు. మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో క‌లిసి నీటిని విడుద‌ల చేసిన హ‌రీశ్ రావు కళ్ల ముందు నీళ్లు పారుతున్నా విప‌క్షాల‌కు క‌నిపించ‌డం లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని ఆయ‌న‌ చెప్పారు.

గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని హ‌రీశ్ రావు విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాతే పొలాలకు నీళ్లు వచ్చాయని ఆయ‌న‌ చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. అన్నిరంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత ఒక్క‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని హ‌రీశ్ రావు పేర్కొన్నారు. 
Harish Rao
Kaleswaram
KOtta Prabhakar Reddy

More Telugu News