ఫాంహౌస్​ లో మంత్రులతో సీఎం కేసీఆర్​ అత్యవసర సమావేశం

19-03-2022 Sat 13:44
  • హరీశ్ సహా హాజరైన మంత్రులు
  • ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత హాజరు
  • ఉద్యోగ నోటిఫికేషన్లు, వ్యవసాయంపై చర్చ
  • కొనసాగుతున్న సమావేశం
KCR Meet Ministers In Farm House
ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తో పాటు సీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

పాలనాపరమైన అంశాలమీదనే ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు, వ్యవసాయం తదితర అంశాలపై మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. సమావేశంలో పాల్గొనాలంటూ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం.