దుబాయ్ లో ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమం... పోటెత్తిన అభిమానులు
- రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
- రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో భారీ చిత్రం
- ఈ నెల 25న రిలీజ్
- ప్రచార కార్యక్రమాలు ముమ్మరం
- దుబాయ్ వెళ్లిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్
ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు విశేష ప్రజాదరణ పొందాయి.