Tesla: ఎలాన్ మ‌స్క్ అనూహ్య‌ నిర్ణ‌యం..ఎండీవ‌ర్ డైరెక్ట‌ర్ల బోర్డుకు రాజీనామా

elon musk resigns Endeavor Group Holdings board of directors
  • వినోద రంగంలో జెయింట్‌గా ఎండీవ‌ర్‌
  • ఎండీవ‌ర్ బోర్డులో చాలాకాలంగా ఎలాన్ మ‌స్క్‌
  • తాజాగా బోర్డు నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న

వ్యాపార మెళ‌కువ‌ల్లో త‌న‌ను మించిన వారు లేర‌న్న రీతిలో నిత్యం ఏదో ఒక విష‌యంపై మాట్లాడే టెస్లా వ్య‌వ‌స్థాప‌కుడు ఎలాన్ మ‌స్క్‌..ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో కూడా తెలియ‌డం లేదు. తాజాగా అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ మ‌స్క్ ఓ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఎండీవ‌ర్ గ్రూప్ హోల్డింగ్స్ డైరెక్ట‌ర్ల బోర్డుకు రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఈ మేర‌కు ఎండీవ‌ర్ గ్రూప్ ఈ విష‌యాన్ని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్ కమిషన్‌కు తెలియ‌జేసింది. వినోద రంగంలో పేరెన్నికగ‌న్న సంస్థ‌గా ఉన్న ఎండీవ‌ర్... మీడియా, హాలీవుడ్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో ఎంతో ఆదరణను పొందింది. అనుబంధ సంస్థల ద్వారా వినోద కంటెంట్‌ను అందిస్తోంది.

అలాగే మార్కెటింగ్, లైసెన్సింగ్, ప్రాతినిధ్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో సైతం ప్రత్యేకతను చాటుకుంది. ఇలాంటి కంపెనీ డైరెక్ట‌ర్ల బోర్డులో స‌భ్యుడిగా కొన‌సాగుతున్న మ‌స్క్‌..ఇక‌పై తాను బోర్డులో కొన‌సాగ‌లేన‌ని ప్ర‌క‌టించేశారు. ఈ ఏడాది మే వ‌ర‌కే బోర్డులో స‌భ్యుడిగా ఎలాన్ ఉంటార‌ని, జూన్‌లో ఆయ‌న బోర్డు నుంచి వైదొ‌లగుతార‌ని ఎండీవ‌ర్ ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News