Navatha Transport: 8 పార్సిళ్ల‌లో 100 బాంబులు.. హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు

100 bombs detected in navatha transport parcel
  • చిల‌క‌లూరిపేట‌ నుంచి పూణేకు పార్సిల్‌
  • వ‌న‌స్థలిపురం చేరిన 8 కార్ట‌న్లు
  • సాధార‌ణ త‌నిఖీల్లో బాంబులున్న‌ట్లు గుర్తింపు
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన న‌వ‌తా ట్రాన్స్‌పోర్టు
  • సినిమా షూటింగ్‌లో వినియోగించే బాంబులుగా గుర్తింపు

హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో గురువారం పెను క‌ల‌క‌ల‌మే రేగింది. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌ నుంచి మ‌హారాష్ట్రలోని పూణేకు పార్సిల్‌గా పంపుతున్న 8 కార్ట‌న్ల‌లో ఏకంగా 100 బాంబులు బ‌య‌ట‌ప‌డ్డాయి. వ‌న‌స్థ‌లిపురంలోని న‌వ‌తా ట్రాన్స్ పోర్టు కార్యాల‌యంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్క‌డ‌కు చేరుకున్నారు. 

చిల‌క‌లూరిపేట‌ నుంచి పూణేకు పార్సిల్ రూపంలో బుక్కయిన 8 కార్ట‌న్లు ఈ నెల 15న వ‌న‌స్థ‌లిపురం చేరాయి. సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ఈ కార్టన్ల‌లో బాంబులు ఉన్న‌ట్లు గుర్తించిన న‌వ‌త ట్రాన్స్ పోర్టు సిబ్బంది వెనువెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు కార్ట‌న్ల‌ను ఓపెన్ చేయ‌గా.. 8 కార్ట‌న్ల‌లో 100 బాంబులు బ‌య‌ట‌ప‌డ్డాయి. చివరికవి సినిమా చిత్రీక‌ర‌ణ‌లో వినియోగించే బాంబులుగా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

  • Loading...

More Telugu News