Merefa: ఉక్రెయిన్ లో ఓ పాఠశాలపై రష్యా దాడులు... 21 మంది మృతి

People killed in Russian attacks on Ukraine town Merefa
  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • మెరెఫా నగరంపై శతఘ్నులతో గుళ్ల వర్షం
  • ఓ పాఠశాలతో పాటు సాంస్కృతిక కేంద్రం దెబ్బతిన్న వైనం
ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడిందని స్థానిక వర్గాలు తెలిపాయి. మెరెఫా పట్టణంలోని పాఠశాలను, సాంస్కృతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్ న్యాయాధికారులు తెలిపారు. రష్యా సేనల శతఘ్నులతో గుళ్లవర్షం కురిపించారని, ఈ దాడుల్లో 21 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారని వెల్లడించారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని వివరించారు. 

ఖార్కివ్ నగర శివారు ప్రాంతంలో ఉండే మెరెఫా పట్టణం రష్యా బలగాల దాడులతో వణికిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తర్వాత రెండో పెద్ద నగరం ఖార్కివ్ లో ఎటు చూసినా విధ్వంసమే దర్శనమిస్తోంది.
Merefa
Ukraine
Russia
Invasion

More Telugu News