Janasena: భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

janasena chief pawan kalyan greetings to people
  • రంగులు, పూల స‌మ్మేళ‌నంగా వేడుక‌లు
  • స‌హ‌జ‌సిద్ధ రంగుల‌తోనే జ‌రుపుకోవాలి
  • ఆరోగ్యం, సుఖ‌శాంతులు వెల్లివిరియాల‌ని పవన్ ఆకాంక్ష 
రంగుల కేళి హోలీని పుర‌స్క‌రించుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌తీయుల ఐక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలిచే హోలీని దేశ ప్ర‌జ‌లంద‌రూ ఉల్లాసంగా ఉత్సాహంగా జ‌రుపుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. హోలీ వేడుక‌ల ప్రాశ‌స్త్యాన్ని ప్ర‌స్తావిస్తూ కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

వ‌సంత రుతువు వేళ వ‌చ్చే హోలీని వ‌సంతోత్స‌వంగా కూడా పిలుస్తార‌ని పేర్కొన్న ప‌వ‌న్‌.. వేర్వేరు ప్రాంతాల ప్ర‌జ‌లు ఈ వేడుక‌ల‌ను వేర్వేరు రీతుల్లో జ‌రుపుకుంటార‌ని తెలిపారు. రంగులు, పూల స‌మ్మేళనంగా నిర్వ‌హించుకునే ఈ హోలీ వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ‌శాంతులు వెల్లివిరియాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. హోలీ వేడుక‌ల‌ను స‌హ‌జ‌సిద్ధ‌మైన రంగుల‌తోనే నిర్వ‌హించుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
Janasena
Pawan Kalyan
Holi

More Telugu News