Nani: 'అంటే .. సుందరానికీ' నుంచి నజ్రియా లుక్ వచ్చేస్తోంది!

Ante Sundaraniki movie update
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అంటే సుందరానికీ'
  • నాని సరసన నాయికగా నజ్రియా 
  • దర్శకుడిగా వివేక్ ఆత్రేయ 
  • జూన్ 10వ తేదీన విడుదల
తెలుగుతెరకి ఈ మధ్య కాలంలో కృతి శెట్టి .. శ్రీలీల .. కేతిక శర్మ వంటి అందమైన కథానాయికలు పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ కూడా వరుస సినిమాలను చేస్తూ తమ దూకుడు చూపుతున్నారు. ఇప్పుడు నజ్రియా నజీమ్ కూడా టాలీవుడ్ కి వచ్చేస్తోంది. 'అంటే సుందరానికీ' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పరిచయమవుతోంది.

'బ్రోచేవారెవరురా' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వివేక్ ఆత్రేయ, నాని హీరోగా 'అంటే .. సుందరానికి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మలయాళ .. తమిళ భాషల్లో తన చక్కదనంతో మతులు పోగొట్టేసిన నజ్రియా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 

 ఈ సినిమాలో ఆమె 'లీలా థామస్' అనే పాత్రలో కనిపించనుంది. రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు ఆమె ఫస్టు లుక్ ను రిలీజ్ చేయనున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నరేశ్ .. రోహిణి .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Nani
Nazriya
Vivek Athreya
Ante Sunsaraniki Movie

More Telugu News