Maharashtra: మ‌హారాష్ట్రలో రూ.5 కోట్ల‌కు పెరిగిన ఏసీడీపీ నిధులు

  • ఎంపీ ల్యాడ్స్ మాదిరే ఏసీడీపీ నిధులు
  • ఎమ్మెల్యేల‌కు కేటాయిస్తున్న ప్ర‌భుత్వాలు
  • ఇప్ప‌టిదాకా మ‌హారాష్ట్రలో రూ.4 కోట్లుగా ఏసీడీపీ నిధులు
  • వాటిని రూ.5 కోట్ల‌కు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం
maharashtra increases acdp funds to 5crore

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల‌ (ఏసీడీపీ)ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పెంచింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల కోసం ఎమ్మెల్యేల‌కు ఏటా కొంత మొత్తం నిధుల‌ను కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంపీ ల్యాడ్స్ మాదిరే ఈ ఏసీడీపీ నిధుల‌తో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డ‌తారు. ఈ మొత్తాన్ని ఇప్ప‌టిదాకా రూ.4 కోట్లుగా ఉంటే.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆ మొత్తాన్ని రూ.5 కోట్ల‌కు పెంచింది.

ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ పవార్ బుధ‌వారం నాడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. రూ.1 కోటి మేర పెరిగిన ఈ నిధులు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల్లో మ‌రింత మేర అభివృద్ధి ప‌నులు జ‌రిగేందుకు దోహ‌ద‌ప‌డ‌నున్నాయ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

More Telugu News