RRR: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరగబోతోందంటే..!

RRR pre release event on March 19
  • ఈ నెల 19న 'ఆర్ఆర్ఆర్' కన్నడ వర్షన్ ప్రీరిలీజ్ ఈవెంట్
  • కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ఈవెంట్ నిర్వహణ
  • ముఖ్య అతిథులుగా సీఎం బొమ్మై, శివరాజ్ కుమార్ హాజరయ్యే అవకాశం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఉద్ధృతం చేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మార్చ్ 19 సాయంత్రం ఈవెంట్ ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ పాసుల కోసం kvnproductions.co.inలోకి లాగిన్ కావాలని తెలిపారు. 

అయితే ఈ కార్యక్రమానికి అతిథిలుగా ఎవరు హాజరు కాబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ... కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. తమిళ, మలయాళ, హిందీ భాషల ప్రీరిలీజ్ ఈవెంట్ లు ఇంతకు ముందే జరిగాయి. తెలుగు, కన్నడ ఈవెంట్లు జరగాల్సి ఉంది.

  • Loading...

More Telugu News