Prabhas: ప్రమాదవశాత్తు మరణించిన అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థికసాయం

Prabhas financially helps a fan family
  • ఈ నెల 11న విడుదలైన రాధ్యేశామ్
  • కారంపూడిలో బ్యానర్ కడుతూ అభిమాని మృతి
  • విద్యుదాఘాతానికి గురైన చల్లా పెదకోటి
  • పెద్దమనసుతో స్పందించిన ప్రభాస్
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న రిలీజైంది. అయితే, గుంటూరు జిల్లా కారంపూడిలో సినిమా విడుదలకు ముందు రోజున ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి ప్రమాదవశాత్తు మరణించాడు. బ్యానర్ కడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. 

కారంపూడి మండల ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లా అనిల్ ద్వారా ఈ విషయం ప్రభాస్ కు తెలిసింది. ఈ ఘటన పట్ల ఆయన చలించిపోయారు. వెంటనే రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తాజాగా, రూ.2 లక్షల చెక్కును మృతుడు చల్లా పెదకోటి భార్య పిచ్చమ్మకు అందించారు.
Prabhas
Help
Fan
Karampudi
Guntur District
Radhe Shyam
Tollywood

More Telugu News