West Bengal: బెంగాల్ బెబ్బులి మమత: శత్రుఘ్న సిన్హా

Shatrughan sinha joins TMC
  • ఆమె అడుగుజాడల్లో నడుస్తా
  • ఓ గొప్ప మహిళా నేత ఆమె
  • అసన్సోల్ నుంచి పోటీ చేస్తున్నానని సిన్హా వెల్లడి
  • ఇవాళ తృణమూల్ లో చేరిన శత్రుఘ్న 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై శత్రుఘ్న సిన్హా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ ను వీడి తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

తాజాగా తృణమూల్ లోకి వెళ్లిన ఆయన.. ‘బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ’ అంటూ కొనియాడారు. ‘‘బెంగాల్ బెబ్బులి, విజయవంతమైన సీఎం మమత పిలుపు మేరకు తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప మహిళ, గొప్ప నేత, గొప్ప నాయకత్వం మమత అడుగుజాడల్లో అసన్సోల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్వీట్ చేశారు.  

West Bengal
Shatrughan Sinha
Mamata Banerjee

More Telugu News