William Hurt D: హాలీవుడ్ నటుడు విలియమ్ హర్ట్ మృతి

Oscar Winning Actor William Hurt Dies At 71
  • 2018లో విలియంకు ప్రొస్టేట్ కేన్సర్ నిర్ధారణ
  • ఎన్నో గొప్ప పాత్రలతో మెప్పించిన నటుడు
  • కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు

హాలీవుడ్ చిత్రాల కథానాయకుడు, వెటరన్ యాక్టర్,  ఆస్కార్ పురస్కార గ్రహీత విలియమ్ హర్ట్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. మరో వారం రోజుల్లో 72 ఏళ్లు నిండుతాయనగా.. విధి ఆయన జీవితానికి ముగింపు పలికింది.  

ద బిగ్ చిల్, ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాలతో విలియమ్ హర్ట్ ఎంతో మందికి పరిచయస్తులు. 2018 మే నెలలో ఆయనకు ప్రొస్టేట్ కేన్సర్ బయటపడింది. కేన్సర్ కారణంగా మరణించారా? లేక వృద్ధాప్యపు సమస్యలతో మరణించారా? అన్న విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. 

1983లో ‘గోర్కే పార్క్’ సినిమాలో రష్యా పోలీసు ఆఫీసర్, 1991లో వచ్చిన ‘అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ సినిమాలో అంధులకు ఉపయోగపడే మెషిన్ ను తయారు చేసే పాత్రలతో విలియమ్ హర్ట్ విమర్శకులను సైతం మెప్పించారు. 1980లో వచ్చిన 'ఆల్టర్డ్ స్టేట్స్' ఆయనకు తొలి సినిమా. అందులో సైంటిస్ట్ పాత్రలో కనిపించారు. 1985లో వచ్చిన ‘కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్’ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. 1950 మార్చి 20న వాషింగ్టన్ లో ఆయన జన్మించారు.

  • Loading...

More Telugu News