Balakrishna: 'అఖండ' నిర్మాత మాటలకు అర్థమేమిటి?

Akhanda producer is doing another movie with Balakrishna
  • సంచలన విజయాన్ని సాధించిన 'అఖండ'
  • బాలయ్య కెరియర్లోనే ప్రత్యేక స్థానంలో నిలిచిన సినిమా 
  • బాలయ్యతో మరో సినిమా ఉందన్న నిర్మాత రవీందర్ రెడ్డి  
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' ఈ నెల 11వ తేదీన 100 రోజులను పూర్తిచేసుకుంది. 12వ తేదీన 'కర్నూల్'లో 100 రోజుల వేడుకను నిర్వహించారు. ఈ వేదికపై ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడిన మాటలను గురించిన చర్చనే ఇప్పుడు నడుస్తోంది. 

"ఒక సినిమా 100 రోజులు ఆడటం అన్నది చాలా కాలం క్రితం విన్నాను .. ఇంతకాలానికి ఇప్పుడు చూశాను. బాలకృష్ణ అభిమానులు తొడగొట్టి మీసం మెలేసే సినిమా మరొకటి నిర్మించాలని ఉంది. త్వరలో ఒక మంచిరోజు చూసుకుని ఆయనను కలుస్తాను" అంటూ మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడారు. 

అయితే తమ కాంబినేషన్లో 'అఖండ' సీక్వెల్ ఉంటుందని ఇంతకుముందే బోయపాటి చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన లేకుండా బాలకృష్ణను కలుస్తానని రవీందర్ రెడ్డి అన్నారు. అంటే ఇది బోయపాటి ప్రమేయం లేని వేరే ప్రాజెక్టు కోసమా? లేదంటే 'అఖండ' సీక్వెల్ విషయంపై అధికారిక చర్చనా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
Balakrishna
Miryala Ravindar Reddy
Boyapati Sreenu

More Telugu News