Kamal Haasan: 'విక్రమ్' రిలీజ్ డేట్ ఖరారు చేసిన కమల్!

Vikram movie update
  • ప్రయోగాత్మక చిత్రంగా 'విక్రమ్' 
  • డిఫరెంట్ లుక్ తో కమల్ 
  • అంచనాలు పెంచుతున్న అప్ డేట్స్ 
  • జూన్ 3వ తేదీన విడుదల

కమలహాసన్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయన ఎన్నో ప్రయోగాత్మకమైన పాత్రలను చేశారనేది అర్థమవుతుంది. ప్రయోగాత్మక కథల విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయలేదు. రిస్క్ అనుకున్నప్పుడు తన సొంత బ్యానర్లో ఆ కథలను తెరకెక్కిస్తూ వెళ్లారు. 

ఇప్పుడు కూడా ఆయన 'విక్రమ్' అనే ప్రాజెక్టుతో రిస్క్ చేస్తున్నారు. తన సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో ఆయన నిర్మించిన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజున ప్రకటించనున్నట్టు ముందుగానే చెప్పారు. అన్నట్టుగానే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కొంత సేపటి క్రితం విడుదల చేశారు. 

ఈ సినిమాను జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కమల్ డిఫరెంట్ లుక్ .. ఈ సినిమా నుంచి వచ్చిన కాన్సెప్ట్ వీడియో ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. 'ఖైదీ' .. 'మాస్టర్' తరువాత లోకేశ్ కనగరాజ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News