Congress: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం... ప్రక్షాళన చేయాలన్న అసమ్మతి నేతలు?

CWC meet concluded
షార్ట్స్‌లో చూడండి
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి మరోసారి దిమ్మదిరిగిపోయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పంజాబ్ లో ఘోర పరాజయం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఈ నేపథ్యంలో ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన సుదీర్ఘ సమయం పాటు జరిగిన ఈ భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. 

ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై చర్చించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు, జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ-23 అసమ్మతి నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Congress
CWC
Sonia Gandhi
Rahul Gandhi
G-23
India

More Telugu News