Janasena: జ‌న‌సేన ఆవిర్భావ వేడుక సీడీపీ చూశారా?

  • ఇప్ప‌టికే పోస్ట‌ర్‌, సాంగ్ రిలీజ్‌
  • తాజాగా సీడీపీ విడుద‌ల‌
  • సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల కోస‌మ‌ని వెల్ల‌డి
janasena formation day cdp released

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన త‌న ఆవిర్భావ వేడుక‌ల‌కు సిద్ధ‌మైపోతోంది. ఈ నెల 14న జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామ ప‌రిధిలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావ‌చ్చాయి. 

ఇప్ప‌టికే ఈ వేడుక‌ల పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. శ‌నివారం సాయంత్రం వేడుక‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన గీతాన్ని విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వేడుక‌ల‌కు సంబంధించిన సీడీపీని పార్టీ విడుద‌ల చేసింది. అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు వినియోగించుకునేలా సీడీపీని విడుద‌ల చేసిన‌ట్లు పార్టీ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

More Telugu News