ఒకేసారి 125 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
- సంస్కరణలకు శ్రీకారం చుట్టిన స్టీఫెన్ రవీంద్ర
- ఇది ఆరంభమేనని ప్రకటించిన కమిషనర్
- స్టీఫెన్ చర్యకు పలువురి అభినందన
కానిస్టేబుళ్ల పదోన్నతిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు. పోలీసు శాఖలో నిజాయతీగా పనిచేసే వారికి పదోన్నతులు తప్పనిసరిగా లభిస్తాయని, అందుకు ఈ పదోన్నతులే నిదర్శనమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. స్టీఫెన్ రవీంద్ర ట్వీట్‌ను మెచ్చుకుంటూ పలువురు ప్రముఖులు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.