Chiranjeevi: సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ కు చిరంజీవి.. వారం రోజులు అక్కడే బస!

Chiranjeevi to stay in Salman Khan farm house
  • 'గాడ్ ఫాదర్' సినిమాలో కలిసి నటిస్తున్న చిరంజీవి, సల్మాన్ ఖాన్
  • వారం రోజుల పాటు వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ముంబైలో చిత్రీకరణ
  • తన ఫామ్ హౌస్ లో చిరంజీవికి ఆతిథ్యం ఇవ్వనున్న సల్మాన్
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నారు. 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ 'లూసిఫర్' రీమేక్ కా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. 

'గాడ్ ఫాదర్' చిత్రంలో మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి పోషిస్తుండగా... పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషిస్తున్నాడు. చిరంజీవితో సల్మాన్ ఖాన్ కు ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. దీంతో, ఈ సినిమాలో నటించాలని అడిగిన వెంటనే రెండో ఆలోచన లేకుండా సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 

చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచి ఈ చిత్రంపై అమితమైన ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ను ముంబైలో షూట్ చేయబోతున్నారు. ఎన్డీ స్టూడియోస్ లో షూటింగ్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. నేటి నుంచి వారం రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగబోతోంది. 

మరోవైపు షూటింగ్ కోసం చిరంజీవి ముంబై వస్తుండటంతో.. తన ఫామ్ హౌస్ లోనే చిరంజీవికి సల్మాన్ ఖాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. ముంబైలో షూటింగ్ జరిగే వారం రోజులు సల్మాన్ ఫామ్ హౌస్ లోనే మెగాస్టార్ బస చేయనున్నాడు. సల్మాన్ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆయనకు అత్యంత ఆత్మీయులు మాత్రమే అక్కడ విడిది చేస్తారు.
Chiranjeevi
Salman Khan
God Father Movie
Mumbai
Farm House

More Telugu News