Balakrishna: బాలకృష్ణ సెట్లో బోయపాటి!

Boyapati went to Balakrishna New Movie Set
  • సంచలన విజయం సాధించిన 'అఖండ'
  • నిన్నటితో 100 రోజులు పూర్తి 
  • ఈ రోజు సాయంత్రం కర్నూల్ లో ఈవెంట్
  • అభినందనలు తెలిపిన గోపీచంద్ మలినేని
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. బాలకృష్ణ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

దర్శకుడు బోయపాటి నిన్న ఈ సినిమా సెట్ కి వెళ్లారు. గోపీచంద్ మలినేని ఆయనకు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. నిన్నటితో 'అఖండ' 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని ఆయనకు బొకే అందిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం 'కర్నూల్'లో ఈ సినిమా 100 రోజుల వేడుకను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక గోపీచంద్ మలినేని సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఇక ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ దునియా విజయ్ చేస్తున్నాడు. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు.
Balakrishna
Boyapati Sreenu
Gopichand Malineni Movie

More Telugu News