Teran: విప్లవ వీరుడు చేగువేరాను చంపిన మాజీ సైనికుడు టెరాన్ మృతి

Teran the soldier who killed Che Guevara died
  • ప్రపంచ విప్లవ సూర్యుడిగా చేగువేరాకు గుర్తింపు
  • 1967లో బంధించిన బొలీవియా సైన్యం
  • అధ్యక్షుడి ఆదేశాలతో చేగువేరా కాల్చివేత
ప్రపంచవ్యాప్తంగా యువతలో విప్లవ భావాలు రగిల్చినవారిలో ఎర్నెస్టో చేగువేరా ఒకరు. ఈ మార్క్సిస్టు విప్లవ వీరుడు 1967లో బొలీవియా సైన్యానికి పట్టుబడ్డాడు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ, క్యూబాకు చెందిన ఏజెంట్ల సాయంతో చేగువేరాను పట్టుకోగలిగారు. నాడు చేగువేరాను బంధించిన వారిలో బొలీవియా సైనికుడు మారియో టెరాన్ సాలజార్ ఒకడు. అరెస్ట్ అయిన సమయంలో చేగువేరా అనారోగ్యతో బాధపడుతున్నాడు. దాంతో ఆయనను లా హిగ్వేరా అనే గ్రామంలోని ఓ స్కూల్లో ఉంచారు. 
అయితే, చేగువేరాను ప్రాణాలతో ఉంచడం ప్రమాదకరం అని భావించిన నాటి బొలీవియా ప్రభుత్వం అతనిని కాల్చిచంపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. బొలీవియో అధ్యక్షుడు రెనే బారియంటోస్ ఆదేశాలతో టెరాన్ అక్టోబరు 9న చేగువేరాను కాల్చి చంపాడు. దాంతో టెరాన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం టెరాన్ వయసు 80 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో సియర్రాలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
.
Teran
Soldier
Bolivia
Che Guevara

More Telugu News