జనసేన ఆవిర్భావ సభకు విరాళాలు
- 14న జనసేన ఆవిర్భావ వేడుకలు
- సహకరించాలంటూ ప్రవాసాంధ్రులకు పిలుపు
- రూ.1 లక్ష పంపిన శ్రీనివాసులు బల్నీది
- ధన్యవాదాలు చెబుతూ జనసేన ట్వీట్
నాదెండ్ల పిలుపునకు ప్రవాసాంధ్రుల్లోని జన సైనికులు బాగానే స్పందిస్తున్నట్లుగా సమాచారం. విదేశాల్లో ఉంటున్న శ్రీనివాసులు బల్నీది అనే వ్యక్తి జనసేన ఆవిర్భావ వేడుకలకు తన వంతుగా తాజాగా రూ.1 లక్షను పంపారు. ఈ మేరకు శ్రీనివాసులు పంపిన మొత్తం తమకు అందిందని, పార్టీ ఆవిర్భావ వేడుకలకు తన వంతుగా సహకరించిన శ్రీనివాసులుకు ధన్యవాదాలు చెబుతూ జనసేన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.