Akhil: అఖిల్ 'ఏజెంట్' విడుదల తేదీ అధికారిక ప్రకటన!

Akhil starring Agent movie will be released in August
  • అఖిల్, సాక్షి వైద్య జంటగా ఏజెంట్
  • ఆగస్టు 12న విడుదల అంటూ ప్రకటన 
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రం
  • కీలకపాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తాజా చిత్రం ఏజెంట్. చిత్రబృందం ఈ సినిమా రిలీజ్ డేట్ నేడు ప్రకటించింది. ఏజెంట్ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది. కాగ, ఏజెంట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. 

ఈ చిత్రం ఏకే ఎంటర్టయిన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు లవర్ బాయ్ చిత్రాల్లో నటించిన అఖిల్ ఈసారి యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏజెంట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, కరోనా సంక్షోభంతో ఈ చిత్రం షూటింగ్ పలుమార్లు వాయిదాపడింది. ఇందులో అఖిల్ సిక్స్ ప్యాక్ తో దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Akhil
Agent
Release Date
August
Tollywood

More Telugu News