Andhra Pradesh: రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి జగన్ ఇక మోదీని అడిగే సాహసం చేయలేరు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

TDP MP Rammohan Naidu Said Jagan no more fight for Ap Interests
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జగన్‌లో మరింత భయం
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక కేంద్రాన్ని ఏమీ అడగలేరు
  • తమ బలం తక్కువగా ఉన్నా పోరాడుతున్నామన్న నాయుడు 
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం జగన్‌కు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని, ఇకపై కేంద్రాన్ని చూసి ఆయన మరింత భయపడతారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఫలితంగా రాష్ట్రానికి మరింత అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ ఫలితాలతో బీజేపీ మరింత బలంగా మారిందని, రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధుల గురించి ఇకపై కేంద్రాన్ని అడగలేని బలహీన పరిస్థితిలోకి జగన్ వెళ్లిపోతారని అన్నారు. 

అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తమ బలం తక్కువగానే ఉన్నప్పటికీ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని అన్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుండడం వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడడం లేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయన్న వాదన సరికాదని అన్నారు.
Andhra Pradesh
Rammohan Naidu
Telugudesam

More Telugu News