Punjab: పంజాబ్‌లో ఘన విజయం సాధించిన ‘ఆప్’కు మోదీ అభినందనలు.. పూర్తి సహకారం అందిస్తామని హామీ

Modi assure all possible support to punjab AAP
  • 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో ‘ఆప్’ విజయం
  • కనీస పోటీ ఇవ్వలేకపోయిన మిగతా పార్టీలు
  • పంజాబ్ సంక్షేమానికి మద్దతు ఇస్తామన్న మోదీ 
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం ఆ పార్టీకి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. నిన్న వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అఖండ విజయం సాధించింది. పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాలు గెలుచుకుని అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 

మిగతా పార్టీలేవీ కనీసం ఆ పార్టీకి పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్ 18 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, శిరోమణి అకాలీదళ్ కూటమి నాలుగు, బీజేపీ దాని మిత్రపక్షాలు రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఫలితంగా ఢిల్లీకి ఆవల తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విజయంతో జోరుమీదున్న ఆ పార్టీ చీప్ కేజ్రీవాల్ జాతీయ పార్టీగా ఆప్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Punjab
Narendra Modi
Arvind Kejriwal

More Telugu News