Radhe Shyam: రాధేశ్యామ్ విడుదలకు సర్వం సిద్ధం... చివరి నిమిషంలో నిర్మాతలకు ఊరటనిచ్చిన ఏపీ సర్కారు

AP Govt takes important decision on Radhe Shyam tickets
  • మార్చి 11న రాధేశ్యామ్ విడుదల
  • తమ చిత్రానికి రూ.170 కోట్ల బడ్జెట్ అయిందన్న నిర్మాతలు
  • ప్రీమియం టికెట్ పై రూ.25 పెంచుకోవచ్చన్న ప్రభుత్వం
  • ఇటీవల కొత్త జీవో ఇచ్చిన సర్కారు
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం శుక్రవారం (మార్చి 11) నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే, ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకోలేదన్న కారణంతో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు లేక నిరాశకు గురైన రాధేశ్యామ్ చిత్రబృందానికి చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం ఊరట కలిగించింది. ప్రీమియం టికెట్ ధరను రూ.25 మేర పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

రాధేశ్యామ్ చిత్రానికి రూ.170 కోట్ల మేర బడ్జెట్ అయ్యిందంటూ చిత్ర నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే, ప్రీమియం టికెట్ పై ధర పెంచుకునే అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇటీవల తెచ్చిన జీవో ప్రకారం... పారితోషికాలు కాకుండా సినిమా కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తే టికెట్ ధర పెంచుకునే వీలుంది! ఈ నిబంధన ఆధారంగానే రాధేశ్యామ్ నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. వారి విన్నపానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Radhe Shyam
Premium Tickets
Release
Andhra Pradesh

More Telugu News