Bellamokonda: సితార బ్యానర్లో బెల్లంకొండ పాన్ ఇండియా మూవీ?

Bellamkonda in Sitara Movie
  • మాస్ హీరోగా బెల్లంకొండకి క్రేజ్ 
  • 'ఛత్రపతి' రీమేక్ తో బిజీ 
  • దర్శకుడిగా వీవీ వినాయక్ 
  • ఇక వరుస ప్రాజెక్టులపై దృష్టి
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం 'ఛత్రపతి' సినిమా హిందీ రీమేక్ లో చేస్తున్నాడు. వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మాస్ యాక్షన్ తో కూడిన ఈ సినిమాతోనే బాలీవుడ్ తెరకి బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయమవుతున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగు పూర్తికాగానే బెల్లంకొండ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడనేది తాజా సమాచారం. సితార బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్ ను సెట్ చేసే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. 

యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను బెల్లంకొండకి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో కూడినవి కావడం విశేషం. బాలీవుడ్ సినిమా కోసం గ్యాప్ ఇచ్చిన ఆయన , ఇక తెలుగులో వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టనున్నాడని చెబుతున్నారు.
Bellamokonda
Sitara
Tollywood

More Telugu News