YSRCP: ఎమ్మెల్సీ స్థానానికి నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి

ruhulla nomination to ap mlc seat
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఆమధ్య ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన మ‌హ్మ‌ద్ క‌రీమున్నీసా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆమె మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఇటీవలే ఎన్నికల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు గురువారం నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ మొద‌లు కాగా.. వైసీపీ అభ్య‌ర్థిగా క‌రీమున్నీసా కుమారుడు రుహుల్లా వైసీపీ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. 

ఈ మేర‌కు గురువారం నాడు పార్టీ కీల‌క నేత‌లు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, గౌత‌మ్ రెడ్డి తదితరులు వెంట రాగా.. అమ‌రావ‌తిలోని శాస‌నస‌భ సెక్ర‌టేరియ‌ట్‌లో రిట‌ర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి రుహుల్లా త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. ఇదిలా ఉంటే..శాస‌న స‌భ‌లో పార్టీల బ‌లాబ‌లాలు చూసుకుంటే.. రుహుల్లా విజ‌యం ఖాయ‌మేనని చెప్పాలి.
Go Back to Shorts
YSRCP
ruhulla
mlc
AP Legislative Council

More Telugu News