Uttarakhand: కాంగ్రెస్ చేతిలో బీజేపీ సీఎం ఓట‌మి

uttarakhand cm loses his seat to congress
  • ఖాతిమా నుంచి పుష్క‌ర్ దామి పోటీ
  • కాంగ్రెస్ అభ్య‌ర్థిగా భువ‌న్ చంద్ర‌
  • భువ‌న్ చేతిలో దామికి ఘోర ప‌రాజ‌యం
  • స్పష్టమైన మెజారిటీ దిశ‌గా బీజేపీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చాలా మంది కీల‌క నేత‌ల‌కు భారీ షాకులే ఇచ్చాయి. పంజాబ్‌లో సీఎంతో పాటు మాజీ సీఎం స‌హా అధికార పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఓట‌మి పాలు కాగా.. ఆ పార్టీ కూడా ఓట‌మిపాలైంది. అయితే ఉత్త‌రాఖండ్ విష‌యానికి వ‌చ్చేస‌రికి..అధికార పార్టీగా ఉన్న బీజేపీ మ‌రోమారు అధికారం చేజిక్కించుకోగా.. ఆ పార్టీ కీల‌క నేత‌, సీఎంగా కొన‌సాగుతున్న పుష్క‌ర్ సింగ్ ధామి మాత్రం ఓట‌మి పాల‌య్యారు. 

ఉత్త‌రాఖండ్‌లోని ఖాతిమా స్థానం నుంచి పుష్క‌ర్ సింగ్ ధామి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఈ స్థానం నుంచి భువ‌న్ చంద్ర అనే అభ్య‌ర్థిని కాంగ్రెస్ బ‌రిలో నిలిపింది. గురువారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశ‌గా సాగుతోంది. అయితే పుష్క‌ర్ సింగ్ ధామి మాత్రం ఆదిలోనే వెనుక‌బ‌డిపోయార‌న్న వార్త‌లు వినిపించాయి. ఆ వార్త‌ను నిజం చేస్తూ పుష్క‌ర్ సింగ్ ధామి ఓటమిపాల‌య్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి భువ‌న్ చంద్ర చేతిలో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు.

  • Loading...

More Telugu News