Ram Gopal Varma: నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయంటూ ఫొటో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

I also have feelings says Ram Gopal Varma
  • తనకు ఎలాంటి ఎమోషన్స్ ఉండవనే వర్మ
  • తాజాగా కుక్కను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వైనం 
  • ఫొటో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన ఏది చేసినా, ఏం మాట్లాడినా ఒక సంచలనమే అవుతుంది. అవతలి వ్యక్తి ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా తన మనసులో ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడం ఆయన ప్రత్యేకత. మరోవైపు వర్మకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అందరూ అనుకుంటుంటారు. ఆయన కూడా తనకు ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవని చెప్పుకుంటుంటారు. 

అయితే తాజాగా ఆయన ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఒక కుక్కను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు... 'నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి' అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News