గోవాలో మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. సాయంత్రం గవర్నర్ తో సమావేశం!
- 40 స్థానాలకు గాను 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ
- తమకు మరో ముగ్గురి మద్దతుందన్న గోవా బీజేపీ
- గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా
ఈ నేపథ్యంలో గోవా బీజేపీ నేతలు స్పందిస్తూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. తమకు మరో ముగ్గురి మద్దతు ఉందని, వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరేందుకు ఈ సాయంత్రం గవర్నర్ ను కలుస్తామని చెప్పారు.
బీజేపీ నేతలు చెపుతున్న ముగ్గురు నేతల్లో ఆంటోనియా వాస్, చంద్రకాంత్ షెట్యే, అలెక్స్ రెజినాల్డ్ ఉన్నారు. ఆంటోనియా వాస్ గెలుపొందినట్టు ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు.