Andhra Pradesh: రోశయ్య, వైఎస్ మంచి స్నేహితులు.. అందరికీ ఆదర్శం ఆయన: ఏపీ సీఎం జగన్

  • ఏపీ శాసనసభలో సంతాప తీర్మానం
  • మాజీ ఎమ్మెల్యేల మృతిపైనా సంతాపం
  • రెండు నిమిషాలు మౌనం పాటించిన సభ్యులు 
AP CM Jagan Says Roshaiah and YSR Are Good Friends

ఏ బాధ్యతలో ఉన్నా రోశయ్య అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఏపీ సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. విద్యార్థి నేత నుంచి సీఎం, గవర్నర్ వరకు వివిధ స్థాయుల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారన్నారు. రోశయ్యతో పాటు ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ఐదుగురు సీఎంల దగ్గర రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి తన ముద్ర వేశారని పేర్కొన్నారు. వైఎస్, రోశయ్య మంచి స్నేహితులని, వాళ్లిద్దరి మధ్యా మంచి సంబంధాలుండేవని చెప్పారు. అలాంటి రోశయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి నారాయణ మూర్తి, కడప ప్రభాకర్ రెడ్డి, వీవీఎస్ఎస్ చౌదరి, గారపాటి సాంబశివరావు, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, పాటిల్ వేణుగోపాలరెడ్డి, యడ్లపాటి వెంకట్రావు, టీఎన్ అనసూయమ్మ, యల్లసిరి శ్రీనివాసులురెడ్డిల మృతిపట్ల సంతాపం తెలిపారు. తర్వాత స్పీకర్ సూచనతో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

More Telugu News