Pawan Kalyan: టీమిండియా అండర్-19 చిచ్చరపిడుగు షేక్ రషీద్ కు పవన్ కల్యాణ్ నజరానా

Pawan Kalyan announces two lakhs for young cricketer Sheikh Rashid
  • టీమిండియా జూనియర్ క్రికెట్లో రషీద్ ప్రకంపనలు
  • ఇటీవల వరల్డ్ కప్ విజేతగా భారత అండర్-19 జట్టు
  • కీలక భూమిక పోషించిన రషీద్
  • రషీద్ కు రూ.2 లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్
ఇటీవల టీమిండియా జూనియర్ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు... షేక్ రషీద్. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలవడంలో రషీద్ ముఖ్యభూమిక పోషించాడు. ఎంతో నిలకడ ప్రదర్శించడంతో పాటు, తన ఆటతీరుకు దూకుడు మేళవించి భవిష్యత్ స్టార్ గా గుర్తింపు పొందాడు. షేక్ రషీద్ గుంటూరుకు చెందినవాడన్న విషయం తెలిసిందే. కాగా, రషీద్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నజరానా ప్రకటించారు. రషీద్ కు రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. పవన్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ట్రస్టు నుంచి ఈ నజరానా అందించనున్నారు.
Pawan Kalyan
Sheikh Rashid
Two Lakhs
Under-19
Team India
Guntur
Andhra Pradesh

More Telugu News