Gadikota Srikanth Reddy: నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఎంతో హుందాగా వ్యవహరించారు... టీడీపీ తీరు అందుకు విరుద్ధంగా ఉంది: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

YCP Govt Chief Whip Sreekanth Reddy slams TDP leaders
  • ఏపీ అసెంబ్లీలో రగడ
  • గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ సభ్యులు
  • ప్రసంగం ప్రతులను చించివేసిన వైనం
  • కనీసం ఆ ప్రతుల్లో ఏముందో చూసుకున్నారా? అంటూ చీఫ్ విప్ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా టీడీపీ నేతల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే, ప్రతులను చించి విసిరేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. గవర్నర్ పై దాడి చేయడం అంటే ఒక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టేనని విమర్శించారు. టీడీపీ నేతలు సంస్కార హీనుల్లా ప్రవర్తించడం సబబు కాదని హితవు పలికారు. చించేముందు ఆ ప్రతుల్లో ఏముందో అని చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు. 

గతంలో విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ ఎంతో హుందాగా వ్యవహరించారని, ప్రస్తుతం టీడీపీ వ్యవహరిస్తున్న తీరు అందుకు విరుద్ధంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఏంటో ఇవాళ రుజువైందని వ్యాఖ్యానించారు. బీఏసీ సమావేశంలో సైతం అచ్చెన్నాయుడి తీరు మారలేదని, సభను, వ్యవస్థలను గౌరవించడం టీడీపీ నేతలు అలవర్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Gadikota Srikanth Reddy
TDP Leaders
Atchannaidu
AP Assembly Session
Govenor Speech
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News