Mount Maunganui: మహిళా ప్రపంచకప్.. పాకిస్థాన్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Team India won the toss and opt to bat first against pak in world cup match
  • ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్
  • వన్డేల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు
  • ప్రపంచకప్‌లో రెండుసార్లు భారత్‌పై ఓడిన పాక్ జట్టు
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా మౌంట్ మాంగనూయిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తోనే ఆడుతుండడంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి తోడు వన్డేల్లో పాకిస్థాన్‌పై భారత జట్టుకు అద్వితీయమైన రికార్డు ఉంది. పాక్‌తో జరిగిన పదికి పది మ్యాచుల్లోనూ విజయం సాధించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 

అంతేకాదు, వన్డే ప్రపంచకప్‌లోనూ రెండుసార్లు భారత్ చేతిలో పాక్ మట్టికరిచింది. ముచ్చటగా మూడోసారి కూడా దాయాదిని ఓడించి గెలుపుతో ప్రపంచకప్‌ను ప్రారంభించాలని మిథాలీ సేన పట్టుదలగా ఉంది. 

భారత జట్టు: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తీ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర, మిథాలీ రాజ్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, మేఘన్ సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్
Mount Maunganui
Team New Zealand
Mithali Raj
ICC Womens World Cup 2022

More Telugu News