Ravindra Jadeja: శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న జడేజా.. సెంచరీ పూర్తి

 Ravindra Jadeja notches up second Test ton
  • తన ఖాతాలో రెండో టెస్ట్ సెంచరీ రికార్డు
  • నిలకడగా బ్యాటింగ్
  • రాణించిన రవిచంద్రన్ అశ్విన్
  • 61 పరుగుల వద్ద ఔట్

రవీంద్ర జడేజా బ్యాటింగ్ మెరుపులతో శ్రీలంక బౌలర్లను వణికిస్తున్నాడు. శ్రీలంక జట్టుతో మొహాలీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు జడేజా తన ఖాతాలో రెండో సెంచరీ రికార్డు వేసేసుకున్నాడు. 102 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. మొత్తం జట్టులో జడేజానే అత్యధిక స్కోరుతో ముందున్నాడు. 

జడేజాకు తోడుగా రవిచంద్రన్ అశ్విన్ సైతం మెరిశాడు. 61 పరుగులు సాధించి సురంగ లక్మల్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. జడేజా తర్వాత రిషబ్ పంత్ 96 పరుగులతో రెండో అత్యధిక స్కోరర్ గా ఉన్నాడు. కీలకమైన పంత్, అశ్విన్ వికెట్లను తీసింది లక్మల్ కావడం గమనార్హం.  రెండో రోజు శనివారం మధ్యాహ్నం లంచ్ విరామ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News