M.Venkateswararao: జనసేన పార్టీలో చేరిన ఆర్టీసీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు

APSRTC retired executive director Venkateswararao joins Janasena
  • ఏపీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలం పనిచేసిన వెంకటేశ్వరరావు
  • పవన్ ఆలోచనలు నచ్చాయని వెల్లడి
  • జనసేన సిద్ధాంతాలు ఆకట్టుకున్నాయని వివరణ
  • వెంకటేశ్వరరావును పార్టీలోకి స్వాగతించిన నాదెండ్ల

ఏపీఎస్ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసిన ఎం.వెంకటేశ్వరరావు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ఆయన ఆర్టీసీ ఈడీగా పదవీ విరమణ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజాపక్షంగా ఉన్నాయని, అందుకే జనసేనలో చేరాలన్న నిర్ణయం తీసుకున్నానని వెంకటేశ్వరరావు వెల్లడించారు. 

హైదరాబాదులోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వెంకటేశ్వరరావు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు నాదెండ్ల మనోహర్ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని, పార్టీ విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. వెంకటేశ్వరరావు కడప జిల్లా రాజంపేటకు చెందినవారు.

  • Loading...

More Telugu News