China: రష్యా దాడికి దిగనున్నట్టు బీజింగ్ కు ముందే తెలుసా?.. ఒలింపిక్స్ ముగిసే వరకు ఆగాలని కోరిందా?

China asked Russia to delay Ukraine invasion until after Olympics
  • ఇంటెలిజెన్స్ వర్గాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ కథనం
  • ఒలింపిక్స్ ముగిసే వరకు ఆగాలని కోరిన చైనా అధికారులు
  • ఫిబ్రవరి 20తో ముగిసిన క్రీడలు
  • 24న యుద్ధాన్ని మొదలు పెట్టిన రష్యా
  • కథనాలను ఖండించిన చైనా
రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగనున్నట్టు చైనాకు చాలా ముందుగానే ఉప్పందిందా? తాజాగా వెలుగు చూస్తున్న సమాచారాన్ని పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. బీజింగ్ ఒలింపిక్స్ ముగిసే వరకు ఉక్రెయిన్ పై దాడికి వెళ్లొద్దంటూ రష్యాను చైనా అధికారులు కోరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4న మొదలు కాగా, 20న ముగిశాయి. రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించడం గమనార్హం. రష్యా ప్రణాళికల గురించి చైనా అధికారులకు ఓ స్థాయి సమాచారం ఉందన్నది ఇంటెలిజెన్స్ నివేదికల సారాంశంగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 

అయితే, ఈ కథనాలను వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లీ పెంగ్యూ ఖండించారు. ‘‘సంబంధిత నివేదికల్లో పేర్కొన్న సమాచారం ఆధార రహితం. చైనాను నిందించడంతోపాటు, ఈ మరకను మాకు అంటించాలనే ప్రయత్నం’’ అని పేర్కొన్నారు.
China
Russia
invasion
Ukraine
winter olympics
post pone

More Telugu News