Gautham Reddy: గౌతమ్ రెడ్డి శాఖలను ఇతర మంత్రులకు కేటాయించిన సీఎం జగన్

Jagna handovers Gautham Reddy portfolios to other ministers
  • ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు
  • అసెంబ్లీలో గౌతమ్ శాఖలను చూడనున్న ఇతర మంత్రులు
  • ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గౌతమ్
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై 50 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. మరోవైపు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి శాఖలను ఇతర మంత్రులకు సీఎం జగన్ కేటాయించారు. ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలను సీదిరి అప్పలరాజుకు, లా అండ్ జస్టిస్ శాఖను ఆదిమూలపు సురేశ్ కు, జీఏడీ శాఖను కురసాల కన్నబాబుకు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ శాఖను బుగ్గన రాజేంద్రనాథ్ కు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ శాఖల వ్యవహారాలను ఆయా మంత్రులు చూడనున్నారు.
Gautham Reddy
YSRCP
Jagan
AP Assembly Session

More Telugu News