Yanamala: హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: యనమల

  • ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు
  • హైకోర్టు తీర్పును గౌరవించాలంటూ ప్రభుత్వానికి యనమల సూచన
  • ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్య
AP govt should respect HC verdict says Yanamala


అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని చెప్పింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పింది. హైకోర్టు తీర్పుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హర్ష్యం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

మూడు రాజధానుల బిల్లు చెల్లదని తాము ముందు నుంచి చెపుతూనే ఉన్నామని అన్నారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, పైకోర్టులో అప్పీల్ కు వెళ్లకూడదని సూచించారు. కోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములను అభివృద్ధి చేసి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.

More Telugu News